కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. | Burglars Theft Money From ATM In Chityal Nalgonda | Sakshi
Sakshi News home page

కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి..

Feb 9 2021 1:18 PM | Updated on Feb 9 2021 2:40 PM

Burglars Theft Money From ATM In Chityal Nalgonda - Sakshi

దుండగులు వాహనాలను అపహరించి అందులో ప్రయాణించారు. మొదట వట్టిమర్తి లో అపహరించిన ఇండికా కారులో వెలిమినేడు వరకు వచ్చిన దుండగులు అక్కడే దానిని వదిలేశారు.

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో దొంగలు రెచ్చిపోయారు. జాతీయ రహదా రిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఆదివారం అర్ధరాత్రి ఓ ఏటీఎంలో చోరీ చేశారు. అందు లోంచి రూ.7.12 లక్షలు ఎత్తుకెళ్లారు. మరో ఏటీఎంలో కూడా చోరీకి విఫలయత్నం చేశా రు. ఎస్‌ఐ రావుల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ బస్‌స్టేజీ వద్ద నిలిపి ఉంచిన ఓ కారును దొంగి లించిన దుండగులు పట్టణంలోని ఎస్‌బీఐ పక్కన ఉన్న ఏటీఎం సెంటర్‌కు చేరుకున్నారు. ఆ ఏటీఎంలోని సీసీ కెమెరాలపైకి పొగను పంపి మెషీన్‌ను ధ్వంసం చేశారు.

అదే సమయంలో పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసుల వాహ నం రావడంతో వారు తమ ప్రయత్నాన్ని విరమించుకుని కారులో పరారయ్యారు. ఏటీఎం లో చోరీకి జరిగిన ప్రయత్నాన్ని గుర్తించిన పో లీసులు వెంటనే తేరుకుని జాతీయ రహదారి వెంట గల ఏటీఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో ఇండిక్యాష్‌ ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. క్యాష్‌ ర్యాక్‌లను బయటికి తీసిన దుండగులు అందులోని రూ.7.12 లక్షలను అపహరించారు.  

వాహనాలు అపహరించి ప్రయాణం..
దుండగులు వాహనాలను అపహరించి అందులో ప్రయాణించారు. మొదట వట్టిమర్తి లో అపహరించిన ఇండికా కారులో వెలిమినేడు వరకు వచ్చిన దుండగులు అక్కడే దానిని వదిలేశారు. అనంతరం వెలిమినేడుకు చెందిన సంగప్ప అనే వ్యక్తి క్వాలిస్‌ వాహనాన్ని దొంగిలించి పంతంగి టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని దానిని కూడా అక్కడే వదిలి పరారయ్యారు. చోరీకి రెండు బృందాలుగా వచ్చి నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement