జగత్‌ విఖ్యాత్‌ రెడ్డికి ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు!

Bowenpally Kidnap Case Police Detained 4 Accused In Goa - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో హైదరాబాద్‌ పోలీసులు పురోగతి సాధించారు. గోవాలో నలుగురు నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. సిద్ధార్థ్‌తో పాటు ముగ్గురిని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. అయితే ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త, నిందితుడు భార్గవ్‌రామ్‌ ఆచూకీ మాత్రం లభించలేదు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరు, చెన్నై, గోవా, ఏపీలో ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ఈ కేసులో అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అతడి కారు డ్రైవర్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుతో పాటు మరికొంత మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.(చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. అఖిలప్రియ!)
 
ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంది: డీసీపీ
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులు పరారీలోనే ఉన్నారని నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగెన్వర్ తెలిపారు. భార్గవరామ్‌, గుంటూరు శ్రీను ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా.. న్యాయవాది సమక్షంలో అఖిల ప్రియ విచారణ సాగుతోందన్న డీసీపీ.. రెండో రోజు విచారణ పూర్తయినట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం వరకు అఖిలప్రియ తమ కస్టడీలోనే ఉంటుందని తెలిపారు. ఆమె హెల్త్ కండీషన్ బాగుందని పేర్కొన్నారు.

ఇక విచారణలో భాగంగా కొన్ని కాగా కిడ్నాప్ చేయడానికి గల ఉద్దేశంపైనే ప్రధానంగా విచారణ సాగినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితుల సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు అఖిల ప్రియ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రశ్నలకు మాత్రమే అఖిల ప్రియ జవాబు ఇచ్చారని.. మరికొన్నింటికి గుర్తు లేదంటూ సమాధానం దాట వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం నాటి దర్యాప్తు కీలకంగా మారనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top