
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యాలను ఎండగడుతూ డిసెంబర్ 6న నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగసభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభలో జాతీయ నేతలు పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాల సమాచారం. ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వంపై చార్జిïÙట్ విడుదలలో భాగంగా 6 గ్యారంటీలు, 66 హామీల అమలుతీరు, ఒక్కొక్క గ్యారంటీ ప్రస్తావన, అది ఎలా ఆచరణకు నోచుకోలేదో వివరిస్తూ గ్రాఫిక్స్, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, వీడియో క్లిప్పింగ్‌లు తదితరాలను ప్రదర్శించనున్నారు.
ఆదివారం నుంచి ఈనెల 5 దాకా కాంగ్రెస్ పార్టీ హామీల అమల్లో విఫలం కావడాన్ని ఎత్తిచూపుతూ రాష్ట్ర, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిల్లో చార్జిïÙట్ల విడుదల, బైక్‌ర్యాలీలు, కాంగ్రెస్ గ్యారంటీల గారడీ.. ఆరు అబద్ధాలు 66 మోసాల పేరిట ఇంటింటికీ కరపత్రాల పంపిణీ, ఇతర రూపాల్లో ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నారు. అలాగే కాంగ్రెస్ ఏడాది పాలనపై, హామీల అమల్లో వెనకడుగుపై ప్రజల నుంచి ఫిర్యాదు పత్రాలను స్వీకరించనున్నారు. కాంగ్రెస్ ప్రతీ పథకం, ప్రతీ నిర్ణయం ప్రజల సంక్షేమానికి కాకుండా వారిని దోచుకోవడమే లక్ష్యంగా చేసుకుందని పేర్కొంటూ ఈ పత్రాన్ని బీజేపీ సిద్ధంచేసింది.
కాంగ్రెస్ పార్టీ మహిళలు, యువత, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకిచి్చన హామీలను అమలు చేయకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలను తమ ప్రచారం సందర్భంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. డిసెంబర్ 5న రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రంగా చేపట్టిన కార్యక్రమాలకు ముగింపుగా 6న హైదరాబాద్‌లో సభను నిర్వహించనున్నారు.
