31న తెలంగాణకు జేపీ నడ్డా.. 

BJP Chief JP Nadda Will Come To Telangana On March 31 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాష్‌ నడ్డా ఈ నెల 31న రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా నడ్డా సంగారెడ్డిలో బీజేపీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీవర్గాలు వెల్లడించాయి. 

అదేరోజు  తెలంగాణలోని జనగామ, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలతోపాటు ఏపీలోని మరో రెండు జిల్లాల కార్యాలయాలను ఆయన వర్చువల్‌గా ప్రారంభిస్తారు. సంగారెడ్డిలో జరిగే బహి రంగ సభలో నడ్డా ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన విడిగా సమావేశం కానున్నట్టు సమాచారం.  అనంతరం శంషాబాద్‌ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని పార్టీవర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top