అన్ని రంగాల్లో గణితానిది కీలకపాత్ర

AP And TS States Society For Mathematical Science Conference At Osmania University - Sakshi

ఏపీటీఎస్‌ఎంఎస్‌ అధ్యక్షుడు ఈసీ కేశవరెడ్డి

ఓయూలో ఏపీటీఎస్‌ఎంఎస్‌ గణితశాస్త్ర కాంగ్రెస్‌ ప్రారంభం 

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సొసైటీ ఫర్‌ మ్యాథమెటికల్‌ సైన్స్‌ (ఏపీటీఎస్‌ఎంఎస్‌) 30వ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభమైంది. వర్సిటీ క్యాంపస్‌ లోని ప్రొఫెసర్‌ జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో గణితశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఓయూ సైన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ వీరయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథి వీసీ రవీందర్, గౌరవ అతిథి, ఏపీటీఎస్‌ ఎంఎస్‌ అధ్యక్షుడు, జేఎన్‌టీయూ అనంతపురం ఈసీ కేశవరెడ్డి, కన్వీనర్‌ కిషన్‌ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ ఐటీస్‌ రిలవెన్స్‌ టు సైన్స్‌ అండ్‌ ఇంజనీ రింగ్‌ అనే అంశంపై కేశవరెడ్డి మాట్లాడుతూ.. గణితశాస్త్రం అన్ని రంగాలకు విస్తరించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందన్నారు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా ఎనాలిసిస్, మెషినరీ లర్నింగ్, స్టాటిస్టిక్స్‌లో గణితం కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. ఓయూలో మూడ్రోజులు జరిగే ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరవ నున్నారు. 160 పరిశోధన పత్రాలను ఎంపిక చేశామని, ఉత్తమ పరిశోధన పత్రానికి రూ. 5 వేల నగదు బహుమతి అందచేయనున్నామని  సదస్సు కన్వీనర్‌ కిషన్‌ తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎస్‌ఎంఎస్‌ జనరల్‌ సెక్రటరీ భారతి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top