
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్ వెహికల్స్ మీద 18 చలాన్లు పడ్డాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా చలాన్లు పడినట్లు తెలుస్తోంది. ఇక చలాన్లు పడిన పలు వాహనాలకు ఒకటే నెంబర్ ప్లేటు ఉంది. కాన్వాయ్ సెక్యూరిటీ లేకుండా రోడ్లపైకి పలు వాహనాలు తిరిగాయి. ఇక TG09RR0009 బీఎండబ్ల్యూ కారు రాత్రిపూట సెక్యూరిటీ లేకుండా ఔటర్ రింగ్ రోడ్ మీద తిరిగినట్లు తెలుస్తోంది.