
సైదాబాద్: టీవీ రిమోట్ కోసం తమ్మడితో గొడవ పడిన ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వినయ్‌నగర్ కాలనీకి చెందిన మల్లిక, వెంకన్న దంపతులకు ముగ్గురు సంతానం. ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన వారి పెద్ద కుమార్తె ధృతి చందన (16) ఆదివారం రాత్రి తన తమ్ముడుతో కలిసి టీవీ చూస్తుండగా రిమోట్ విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన ధృతి తమ్ముడిని కొట్టి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.
ఆ తర్వాత కొద్ది సేపటికి ఇంటికి వచి్చన ఆమె తండ్రి వెంకన్న గది తలుపులు కొట్టినా ధృతి స్పందించకపోవడంతో తలుపులు పగుల కొట్టి లోపలికి వెళ్లి చూడగా ధృతి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఆమెను కిందకు దించి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.