తిరువొత్తియూరు: తమిళ మానిల కాంగ్రెస్ 13వ వార్షికోత్సవ ప్రారంభ వేడుకలు శనివారం వ్యాసర్పాడిలో జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంలో 100 ఏళ్లు పైబడిన సీనియర్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతన్ భారతిని శాలువాతో సత్కరించారు. అలాగే ఈ వేడుకల్లో వివిధ ప్రదర్శనలు ఇచ్చిన పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.కె. వాసన్ జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఇ.ఎస్.ఎస్. రామన్, ఉపాధ్యక్షులు శక్తి వడివేల్ ,విడియ శేఖర్, మునవర్ భాష, ప్రధాన కార్యదర్శులు జి ఆర్ వెంకటేశ్,ఎం పి నాదన్,రాణి కృష్ణ, జిల్లా అధ్యక్షులు పలని వేల్ ,గోవింద స్వామి పద్మనాభన్, శ్రీధర్ పాల్గొన్నారు.


