అరుణాచలేశ్వరాలయంలో.. ముగిసిన కార్తీక బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

అరుణాచలేశ్వరాలయంలో.. ముగిసిన కార్తీక బ్రహ్మోత్సవాలు

Nov 29 2026 1:53 PM | Updated on Nov 29 2026 1:53 PM

వేలూరు: తిరువణ్ణామలై కార్తీక బ్రహ్మోత్సవాలు సుబ్రమణ్యస్వామి తెప్పోత్సవంతో శుక్రవారం రాత్రితో ముగిసింది. అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలు గత నెల 14వ తేదీన ప్రారంభమై ఈనెల 24వ తేదిన 2,668 అడుగుల ఎత్తుగల మహా కొండపై మహా దీపాన్ని వెలిగించారు. పది రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామి వార్లు మాడ వీధుల్లోను, గిరివలయం రోడ్డులోను వివిధ అలంకరణ మధ్య వివిధ వాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో అలసి పోయిన స్వామి వార్లుకు తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈనెల 25న చంద్రశేఖరుడు, రెండవ రోజున పరాశక్తి అమ్మవారు, మూడవ రోజైన శుక్రవారం రాత్రి వళ్లి దైవాని సమేత సుబ్రమణ్యస్వామి వారు తెప్పలపై ఊరేగారు. ముందుగా ఆలయ జాయింట్‌ కమిషనర్‌ భరణీధరన్‌ అద్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి ఆలయం సమీపంలోని అయ్యం కోనేటిలోని తెప్పలపై ఆశీనులు చేశారు. అనంతరం స్వామివారు తెప్పలపై మూడు సార్లు భవని వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ నామస్మరణాలు చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కాపాడిన స్వామివారికి ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పరిహార పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సుబ్రమణ్య స్మామి తెప్పలతో ఎటువంటి ఆటంకం లేకుండా ఉత్సవాలు సజావుగా జరగడంతో ఆలయ నిర్వహకులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement