సూర్యతో చిత్రం చేయడానికి నెనెప్పుడూ సిద్ధమే.. | - | Sakshi
Sakshi News home page

సూర్యతో చిత్రం చేయడానికి నెనెప్పుడూ సిద్ధమే..

Nov 29 2026 1:53 PM | Updated on Nov 29 2026 1:53 PM

తమిళసినిమా: వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌ లో ఉన్న నటుడు సూర్య. అంతే కాదు వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. సూర్య హీరోగా నటించిన కరుప్పు, విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌, ఇటీవల విడుదలైన సీన్‌ చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టారు. ప్రస్తుతం ఆయన తన 49 , 50వ చిత్రాలను కమిట్‌ అయ్యారు. కాగా ఆ మధ్య సూర్య నటించిన చిత్రాలు నిరాశపరిచిన సమయంలో ఆయన కథానాయకుడిగా నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన కరుప్పు చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా ఆ తరువాత ఆర్జే బాలాజీ ఇప్పటి వరకు మరో చిత్రం చేయలేదు. దీంతో ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న అర్జే బాలాజీనీ మీ తదుపరి ఏమిటి? మళ్లీ సూర్య హీరోగా చిత్రం చేస్తారా అన్న ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.. సూర్య హీరోగా చిత్రం చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. భగవంతుడి పుణ్యంతో ఆ అవకాశం మళ్లీ వస్తుందని భావిస్తున్నాను. అయితే సూర్య నటించే 49, 50వ చిత్రాల సంఖ్యకు నేను పోటీలో చిక్కుకోవడం నాకిష్టం లేదు. నేను సూర్యతో చేసే చిత్రం అంతకు ముందు చేసిన చిత్రం కంటే బాగా ఉండాలని శ్రమిస్తాను. నా తదుపరి చిత్రం గురించి అడుగుతున్నారు. మూక్కుత్తి అమ్మన్‌ చిత్రం సమయంలో ఆ చిత్రంలో నటి నిత్యామీనన్‌ ను నటింపజేయాలని భావించాం. అయితే అప్పట్లో ఆమెను కలుసు కోలేకపోయాం. అదేవిధంగా నటి శృతిహాసన్‌ నటింప జేయాలను కున్నాం. అదీ కుదరలేదు. త్వరలో వారి లాంటి మంచి నటితో చిత్రం చేసే అవకాశం లభిస్తుందని నమ్ముతున్నాను అని ఆర్జే బాలాజీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement