తిరువళ్లూరు: పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజననూ ఖండిస్తూ వీసీకే ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరువళ్లూరులో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కన్వీనర్ యోగా అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా రీజినల్ కన్వీనర్ దళపతి సుందర్, ప్రధాన కార్యదర్శి బాలసింగం తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా బాలసింగం మాట్లాడుతూ పార్లమెంట్‌లో దక్షణాది రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా పునర్విభజన వుండకూడదన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించయంతో పాటు తమిళనాడుకు పార్లమెంట్ స్థానాలు తగ్గకుండా చూడాలని డిమాండ్ సూచించారు. అనంతరం రీజినల్ కో– ఆర్డినేటర్ సుందరం మాట్లాడుతూ కేంధ్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముస్లీమ్ మైనారీటిల హక్కులను కాలరాస్తున్నారని వాపోయారు. బీజేపీ విధానాలపై ప్రజలు ఇప్పటికే అప్రమత్తం కాకపోతే భవిషత్‌లో మరింత ప్రఽమాదం ఏర్పడే అవకాశం వుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ప్రవీణ్ పాల్గొన్నారు.


