క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Nov 29 2026 1:35 PM | Updated on Nov 29 2026 1:35 PM

వంద కేజీల నిషేధిత ప్లాస్టిక్‌ సీజ్‌ రూ. 2 కోట్ల విలువైన భూమి స్వాధీనం ఓటరు ప్రత్యేక శిబిరాలపై అవగాహన ర్యాలీ ప్రపంచ జూనియర్‌ చెస్‌లో తమిళ కెరటాలు ● సవితా శ్రీ, నివేదితలకు

తిరుత్తణి: తిరుత్తణిలో నిషేధిత ప్లాస్టిక్‌ కర్లు, ప్లేట్లు పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు పిర్యాదు మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ కన్నియప్పన్‌ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది శనివారం పట్టణంలోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా దుకాణాల్లో నిల్వవుంచిన వంద కేజీల ప్లాస్టిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ విక్రయించిన దుకాణాలకు జరిమాన విధించారు. ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయిస్తే దుకాణం లైసెన్స్‌ రద్దుతో పాటు సీల్‌ వేస్తామని కమిషనర్‌ దుకాణాదారులను హెచ్చరించారు. తనిఖీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

తిరువొత్తియూరు: చైన్నెలోని పూక్కడై తంగసాలై (మింట్‌ స్ట్రీట్‌) లో వరదరాజ పెరుమాళ్‌ ఆలయం ఉంది. పురాతనమైన ఈ ఆలయానికి చెందిన భూములు పూక్కడై, సౌకార్‌పేట, మణ్ణడి తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. అదేవిధంగా, తంగసాలై వీధిలో ఆలయానికి చెందిన ఒక పురాతన భవనం ఉంది. ఈ భవనం శిథిలావస్థలో ఉందని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరగకముందే దానిని కూల్చివేసి తొలగించాలని చైన్నె మహానగర పాలక సంస్థ (కార్పొరేషన్‌) సూచించింది. దాని ప్రకారం, హిందూ మత ధర్మాదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ రాము ఆదేశాల మేరకు, అసిస్టెంట్‌ కమిషనర్‌ భువనేశ్వరి, కార్పొరేషన్‌ అధికారులు, హిందూ మత ధర్మాదాయ శాఖ అధికారులు, పోలీసులు, విద్యుత్‌ శాఖ సిబ్బంది సమక్షంలో పొక్లెయిన్‌ యంత్రం సహాయంతో ఆ శిథిల భవనాన్ని శుక్రవారం కూల్చివేసి, ఆ స్థలాన్ని ఆలయ ఆధీనంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.

పళ్ళిపట్టు: ఓటరు ప్రత్యకేక శిబారాలు పట్ల పాఠశాల విద్యార్ధినులు ర్యాలీ చేపట్టి అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ఈ నెల 12న ఓటరు తుది జాబితా విడుదల చేసారు. దీంతో నేడు, డిసెంబర్‌ 5,6 తేదీల్లో ప్రత్యేక ఓటరు శిబిరాలు నిర్వహించనున్నారు. తిరుత్తణి నియోజకవర్గం వ్యాప్తంగా 344 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. ఇందులో ఓటరు పేర్లు నమోదు, తొలగింపు, చిరునామా మార్పుకు సంబంధించి ఓటర్లు ఆయా పోలింగ్‌ కేంద్రాల బీఓల్‌ఓల వద్ద పారం పంపిణీ చేసి సద్వినియోగం చేసుకోవాలన్న మేరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్కేపేటలో రెవెన్యూశాఖ ద్వారా శనివారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ప్రభుత్వ బాలికల మహాన్నత పాఠశాల విద్యార్థినులు పాల్గొని ప్రధాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి ఓటరు ప్రత్యేక శిబిరాల పట్ల అవగాహన కల్పించారు.

సీఎం విజయ్‌ అభినందనలు

సాక్షి, చైన్నె: వెనిజులాలో జరిగిన ఫిడే ప్రపంచ జూనియర్‌ (అండర్‌–20) మహిళల చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ 2026లో విజేతగా నిలిచి చరిత్ర సష్టించిన తమిళనాడు క్రీడాకారిణి సవితా శ్రీకి, ఇదే టోర్నీలో మూడో స్థానం సాధించిన మరో తమిళనాడు క్రీడాకారిణి నివేదితకు ముఖ్యమంత్రి విజయ్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సీఎం విజయ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా వారిని ప్రశంసిస్తూ ఒక సందేశాన్ని పోస్ట్‌ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రీడాకారిణులను ఓడించి సవితా శ్రీ ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌ కై వసం చేసుకోవడం, నివేదిత కాంస్య పతక స్థానంలో నిలవడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. వీరు సాధించిన విజయం నేటి యువ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పి, ప్రపంచ చెస్‌ యవనికపై తమిళనాడుతో పాటు భారతదేశ కీర్తిపతాకను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని సీఎం విజయ్‌ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement