● చిన్నారి మృతి ● పలువురికి తీవ్ర గాయాలు, చికిత్స
వేలూరు: వేలూరు సమీపంలోని వల్లలార్ బస్టాండ్ వద్ద చైన్నె–బెంగుళూరు జాతీయ రహదారిలో ఒక కారు చైన్నె వైపునకు వెలుతుంది. కారును చైన్నె ప్రైవేటు మెడికల్ కళాశాల ఫ్రొఫెసర్ డాక్టర్ అరుణ్‌కుమార్ నడుపుతున్నాడు. కారు వల్లలార్ బస్టాండ్ వద్ద వెలుతున్న సమయంలో డ్రైవర్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొనడంతో పాటు వెంట వెంటనే నాలుగు బైకులను ఢీకొంది. ఆ సమయంలో ఒకే బైకులో ప్రయాణం చేస్తున్న సత్వచ్చారికి చెందిన మహ్మద్, భార్య నూర్మూ, నాలుగు నెలల కుమార్తెతో పాటు ఒక సంవత్సరం చిన్నారి ఇమ్రాన్‌కు తీవ్ర గాయాలైంది. వీటిని గమనించిన స్థానికులు వెంటనే వేలూరులోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి ఇమ్రాన్ మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీటిపై సత్వచ్చారి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కారును డాక్టర్ మద్యం మత్తులో నడిపాడా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.


