చేపపిల్లల పెంపకంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

చేపపిల్లల పెంపకంపై దృష్టి

Nov 29 2026 1:35 PM | Updated on Nov 29 2026 1:35 PM

చేపపిల్లల పెంపకంపై దృష్టి

తిరువళ్లూరు: పూండి యూనియన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో వున్న ఐదు పుష్కరిణిల్లో సుమారు పది వేల చేప పిల్లలను కలెక్టర్‌ కవిత, గుమ్మిడిపూండి ఎమ్మేల్యే విజయకుమార్‌ తదితరులు శనివారం ఉదయం వదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న కొలనులు, చెరువుల్లో చేపల పెంపకం చేస్తామని ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రామ జలాశాయాల్లో చేప పిల్లను నిల్వ చేయడం ద్వారా మత్ససంపదను మెరుగుపరిచి, మత్సకారులకు జీవోనపాధిని కల్పించడం ప్రధాన ఉద్దేశం . ఇందులో భాగంగానే జిల్లాలోని మొత్తం 250 హెక్టార్లు విస్తీర్ణంలో వున్న పంచాయతీ చెరువులు, పుష్కరిణిలో చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటి దశగా పూండి యూనియన్‌లోని మొయ్యూరు, దేవాందవాక్కం, మైలాపూర్‌, తామరైకుళం, ధర్మరాజన్‌ పుష్కరణిలో పది వేల చేప పిల్లలను కలెక్టర్‌ కవిత వదిలారు. వీటిని నిత్యం పర్యవేక్షించడంతో పాటు మత్స సంపధను మరింత పెంచడానికి ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. మత్స్య పరిశ్రమ ద్వారా స్తానిక మత్సకారులు, స్వయం ఉపాధీ సంఘాలు, గ్రామీణ యువతకు స్తిరమైన ఆధాయాన్ని, ఉపాధీని కల్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనార్థనన్‌, ఊత్తుకోట తాహశీల్దార్‌ సంగమిత్ర, టివీకే యూనియన్‌ కార్యదర్శి సంపత్‌, పార్టీ నేతలు త్యాగరాజన్‌, శ్యామ్‌కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement