పళ్ళిపట్టు: పది వేల తాటి విత్తనాలు నాటి పర్యావరణాన్ని కాపాడదామని ఏఎస్పీ శుభమ్ దిమాన్ పిలుపునిచ్చారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం జయంతి సందర్భంగా గురువారం పళ్లిపట్టు సమీపంలోని వెలిగరం గ్రామానికి చెందిన యువత ప్రకృతి పరిరక్షణ, భూగర్భ జలాలు పెంపు లక్ష్యంగా చెరువులు, వ్యవసాయ పొలాల వద్ద తాటి విత్తనాలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో తిరుత్తణి ఏఎస్పీ శుభమ్ దిమాన్ పాల్గొని చెరువు కట్ట ప్రాంతంలో తాటి విత్తనాలు నాటారు. ఆయన మాట్లాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన నీరు, గాలి అందించే లక్ష్యంతో యువత తాటి విత్తనాలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. మాజీ యూనియన్ చైర్మన్ ఉమాపతి, మాజీ పంచాయమతీ సర్పంచ్ వెంకటేశన్ సహా అనేక మంది పాల్గొన్నారు.


