పూర్తి స్థాయి గవర్నర్‌గా అర్లేకర్‌ | - | Sakshi
Sakshi News home page

పూర్తి స్థాయి గవర్నర్‌గా అర్లేకర్‌

Oct 16 2026 7:23 AM | Updated on Oct 16 2026 7:23 AM

పూర్తి స్థాయి గవర్నర్‌గా అర్లేకర్‌

సాక్షి, చైన్నె: తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌గా ఆర్‌.వి.అర్లేకర్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. చైన్నెలోని లోక్‌భవన్‌లో (రాజ్‌భవన్‌) జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రమాణం చేశారు. గతంలో తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్‌.ఎన్‌.రవి పశ్చిమ బెంగాల్‌కు బదిలీ కావడంతో, కేరళ గవర్నర్‌గా ఉన్న ఆర్‌.వి.అర్లేకర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను తమిళనాడు పూర్తికాల గవర్నర్‌గా నియమించారు. పూర్తికాలపు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆర్‌.వి.అర్లేకర్‌ను సీఎం విజయ్‌ సాయంత్రం లోక్‌ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కార్యదర్శి సజ్జన్‌సింగ్‌ ఆర్‌. చవాన్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement