క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 7 2026 12:35 AM | Updated on Oct 7 2026 12:35 AM

● యావజ్జీవ శిక్ష ● అరియలూరు కోర్టు తీర్పు

కార్లు ఢీ

– ఇద్దరు యువకుల మృతి

తిరువొత్తియూరు: రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రామనాథపురం జిల్లా తొండి సమీపంలోని ఉప్పురు గ్రామానికి చెందిన వైరప్రకాష్‌ (45) మంగళవారం ఉదయం తన కారులో ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌ మీదుగా రామనాథపురం వైపు వెళ్తున్నారు.అదే సమయంలో రామనాథపురం నుండి తిరువాడానై వైపు వెళ్తున్న కారులో చోళియకుడికి చెందిన కరుప్పయ్య కుమారుడు మహేంద్రకుమార్‌ (25) వస్తున్నారు. పత్తనేత్తల్‌ వద్ద ఉన్న ఒక వంతెనపై ఈ రెండు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న వైరప్రకాష్‌, మహేంద్రకుమార్‌ ఇద్దరూ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు వారి మృతదేహాలు కార్లలోనే ఇరుక్కు పోయాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత మృతదేహాలను వెలికితీశారు. రెండు కార్లు గుర్తు పట్టలేనంతగా పూర్తిగా ధ్వంసమయ్యాయి.

సహకార సంఘాల ద్వారా

రైతులకు విత్తనాలు, ఎరువులు

కొరుక్కుపేట: తమిళనాడులోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు, పంట సాగుకు అవసరమైన విత్తనాలు, రసాయన ఎరువులు వంటి సాగుకు కావలసిన వనరులను నగదు రూపంలో అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సహకార శాఖ ప్రకటించింది. తమిళనాడులో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతులకు పంట సాగు కోసం స్వల్పకాలిక రుణాలను అందిస్తాయి. దీనికి అదనంగా, ఈ రుణంలో భాగంగా విత్తనాలు, రసాయన ఎరువుల వంటి సాగుకు అవసరమైన సామాగ్రిని కూడా అందించి, పంపిణీ చేస్తాయి. ప్రస్తుతం సహకార సంఘాలలో సభ్యులుగా లేని రైతులు వెంటనే చేరి, తక్కువ వడ్డీకి పంట రుణాల ప్రయోజనం పొందవచ్చు. దీని ద్వారా వారు విత్తనాలు, రసాయన ఎరువులను కూడా పొందగలుగుతారు. ఈ నేపథ్యంలో, రైతులందరి ప్రయోజనం కోసం, నిర్ణీత గరిష్ట విక్రయ ధర ను మించకుండా విత్తనాలు, రసాయన ఎరువులతో సహా సాగుకు అవసరమైన వస్తువులను నగదు రూపంలో పొందేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయి. రైతులు తమ పంట సాగు విస్తీర్ణం , భూమి పత్రాల ఆధారంగా వీటిని నేరుగా నగదు చెల్లించి కొనుగోలు చేయవచ్చునని సహకార శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్థినిని గర్భవతి చేసిన యువకుడికి..

కొరుక్కుపేట : అరియలూరు జిల్లాలోని జయంకొండం ప్రాంతానికి చెందిన పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. జయంగొండం సమీపంలోని ముత్తు సేవా మఠం నుండి పట్టభద్రుడైన 37 ఏళ్ల విల్వేంద్రన్‌ విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా, ఈ పరిచయం ప్రేమగా మారింది. తర్వాత విద్యార్థిని గర్భవతి అయిందని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థిని ఈ విషయాన్ని విల్వేంద్రనన్‌కు నివేదించినప్పుడు, అతను పిండాన్ని తొలగించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియగా, వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి ఫిర్యాదు మేరకు, జయంకొండం ఆల్‌ ఉమెన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విల్వెంద్రనన్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఈ కేసు అరియలూర్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ మహిళా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మణిమేగలై సోమవారం తన తీర్పును వెలువరించారు. విల్వేంద్రనన్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 50,000 జరిమానా విధించారు. బాధితురాలైన విద్యార్థికి నష్టపరిహారంగా రూ. 7 లక్షలు చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.

కొలతల్లో తేడాలు వద్దు

– సిబ్బందికి కలెక్టర్‌ ఆదేశం

తిరువళ్లూరు: రేషన్‌ దుకాణాల్లో నిరుపేదలకు అందించే వస్తువుల కొలతల్లో తేడాలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కవిత సూచించారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరులోని ప్రాధమిక వైద్యకేంధ్రం, రేషన్‌ దుకాణం, ఉపాధీ హమీ పథకం పనితీరు, విద్యార్దులకు అందించే మధ్యాహ్న భోజన పథ కం తదితర వాటిని కలెక్టర్‌ కవిత పరిశీలించా రు. మధ్యాహ్న భోజనం విషయంలో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. భోజనం తయా రు చేసే ప్రాంతాన్ని పరిశుభ్రంగా వుంచుకోవాలని కోరారు. అనంతరం నిరుపేదలకు రేషన్‌ దుకా ణాల ద్వారా అందించే నిత్యావసర వస్తువుల నాణ్యత, కొలతను పరిశీలించారు. కొలతల్లో తేడాలు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. దీంతో పాటు కడంబత్తూరు ప్రాథమిక వైద్యకేంద్రాన్ని పరిశీలించి అక్కడ మందుల స్టాక్‌, నర్సులు ఇతర సిబ్బంది హాజరుపట్టిని పరిశీలించారు. కలెక్టర్‌ వెంట పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement