కొండ చుట్టూ భారీ బందోబస్తు.. ఏఐ కెమెరాలతో నిఘా | - | Sakshi
Sakshi News home page

కొండ చుట్టూ భారీ బందోబస్తు.. ఏఐ కెమెరాలతో నిఘా

Nov 24 2026 1:30 AM | Updated on Nov 24 2026 1:30 AM

వెలిగించకపోతే కోర్టు ధిక్కరణ కేసు వేస్తాం

హిందూ ధర్మ పరిషత్‌ హెచ్చరిక

డీజీపీ, అడ్వకేట్‌ జనరల్‌తో

సీఎం విజయ్‌ భేటీ

రెడ్‌జోన్‌గా తిరుపరకుండ్రం

కార్తీక దీపోత్సవం రోజున గతేడాది కూడా ఇదే అంశంపై నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఈసారి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. తిరుపరకుండ్రం ఆలయం, కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెయ్యికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇతర జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను రప్పించారు. కొండపై ఉన్న దీపస్తంభం, దర్గా పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పళని ఆండవర్‌ ఆలయం నుంచి కొండపైకి వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి నిఘా ఉంచారు. కొండ చుట్టూ ఉన్న కీలక ప్రాంతాల్లో వ్యక్తుల ముఖా లను కచ్చితంగా గుర్తించగల కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశారు.

సాక్షి, చైన్నె:మధురై జిల్లా తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగింపు వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కార్తీక దీపోత్సవం సందర్భంగా మంగళవారం ఒక్క రోజు మాత్రమే తిరుపరకుండ్రం దీపస్తంభం వద్ద దీపం వెలిగించుకోవడానికి సుప్రీంకోర్టు ఈనెల 20వ తేదీన మధ్యంతర అనుమతి ఇచ్చింది. దీపం వెలిగించే బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ, ఆలయ యంత్రాంగం ఆమోదించిన బృందం మాత్రమే ఆ కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చే సింది. అయితే, ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.దీంతో ఆ స్థంభం వద్ద దీపం వెలిగించేనా..? అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలని హిందూ ధర్మ పరిషత్‌ తన వినతిపత్రంలో డిమాండ్‌ చేసింది.

కలెక్టర్‌ ఆదేశాల కోసం ఎదురుచూపు..

ప్రస్తుతం జిల్లా యంత్రాంగం నుంచి దీపస్తంభం వద్ద దీపం వెలిగించడంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కలెక్టర్‌ ఆదేశాల మేరకే తాము నడుచుకుంటామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ఆనవాయితీ ప్రకారం ఉచ్చిపిళ్ళైయార్‌ ఆలయం సమీపంలో కార్తీక దీపం వెలిగించేందుకు అవసరమైన రాగి పాత్ర, నెయ్యి తదితర సామాగ్రిని ఆలయ యంత్రాంగం సిద్ధం చేసింది. మంగళవారం దీపస్తంభం వద్ద దీపం వెలిగిస్తారా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రాజకీయ స్పందనలు – నిరసనలు

ఎండీఎంకే నేత వైగో స్పందిస్తూ, సుప్రీంకోర్టు సమీక్ష పిటిషన్‌ను స్వాగతిస్తూ, మత సామరస్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం దృఢంగా ఉండాలని కోరారు. మదురైలో మత సామరస్య కూటమి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారని, ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీకి అనుమతిచ్చి తమ ర్యాలీని అడ్డుకుంటున్నారని న్యాయవాదులు వాంజీ నాథన్‌, హెన్రీ బేన్‌ ఆరోపించారు. ఇందులో తిరుమావళవన్‌, జవహిరుల్లా పాల్గొంటారన్నారు. బీజేపీ నేత, మాజీ మంత్రి ఎల్‌. మురుగన్‌ స్పందిస్తూ తిరుపరకుండ్రం దీపస్తంభం వద్ద దీపం వెలిగించాలన్నది భక్తుల చిరకాల డిమాండ్‌ అని,సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అమలు చేయకుండా ప్రభుత్వం సమీక్షకు వెళ్లడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్‌ సైతం దీపం వెలిగించాల్సిందేనని కోరారు. కాగా సోమ వారం రాత్రి తిరుపరకుండ్రంను రెడ్‌జన్‌గా అధికారులు ప్రకటించి పలువురిని అదుపు లోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తిరుపరకుండ్రంలో నిఘా కట్టుదిట్టం

సచివాలయంలో సీఎం సమీక్ష

ఈ పరిణామాల మధ్య సీఎం విజయ్‌ సచివాలయంలో కీలక సమాలోచన చేశారు. సీఎం కార్యాలయంలో అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణన్‌తో తొలుత సమావేశమయ్యారు. సమీక్షా పిటిషన్‌ విచారణ గురించి , దీపం వ్యవహారంలో ఉన్న చిక్కులు , తదుపరి న్యాయపరమైన చర్యలపై చర్చించారు. అనంతరం డీజీపీ మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ కూడా సీఎంను కలిసి తిరుపరకుండ్రం పరిస్థితిపై సమాలోచనలు జరిపారు. న్యాయమంత్రి నిర్మల్‌ కుమార్‌తో పాటుగా మరి కొందరు మంత్రులతో కూడి భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజకీయ ప్రాధాన్యత దీపం వ్యవహారంలో నెలకొంది. అదే సమయంలో రాజకీయ పక్షాలు కొన్ని దీపం వె లిగించాలంటూ, మరికొన్ని మత సామరస్యాన్ని పరిరక్షించాలని గళాన్ని విప్పడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement