క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Nov 24 2026 1:24 AM | Updated on Nov 24 2026 1:24 AM

●బంధువులపై అనుమానం ●వృద్ధుడి అరెస్ట్‌ ●14 సవర్లు స్వాధీనం

బీరువాలో 20 సవర్ల

నగలు అదృశ్యం

అన్నానగర్‌: చైన్నె సమీపం పెరంబూర్‌లోని అగరం మూర్తి వీధికి చెందిన శివకుమార్‌ (56) కేబుల్‌ టీవీ ఆపరేటర్‌. ఇతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత అక్టోబర్‌ 19న, అతను ఒక పెళ్లి వేడుకకు హాజరై తన భార్యతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత, వారు ధరించిన బంగారు ఆభరణాలను తీసివేసి, ఇంట్లోని రెండు బీరువలో పెట్టి తాళం వేశారు. ఈ స్థితిలో, గత 15వ తేదీ రాత్రి వారు నగలను తనిఖీ చేయగా, గొలుసు, ఉంగరం, కంకణంతో సహా 20 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. శివకుమార్‌ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, సెంబియం క్రైంబ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దగ్గరి బంధువులను విచారిస్తున్నారు. తలుపులు, బీరువా పగలగొట్టకుండా దొంగిలించబడినందున, ఇందులో బంధువుల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

కల్యాణ మండపాల్లో నగల దొంగతనం

తిరువొత్తియూరు: చైన్నె పురసైవాక్కం, కొసపేట ప్రాంతానికి చెందిన ఉమాపతి ( 56) గత ఏడాది సెప్టెంబర్‌లో వానగరంలోని ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో తన కుమారుడి వివాహం జరిపించారు. ముందు రోజు వివాహ రిసెప్షన్‌ జరిగింది. మరుసటి రోజు వివాహం ముగిసిన తర్వాత నగలను సరి చూసుకోగా, ఎవరో గుర్తుతెలియని వ్యక్తి 2 సవర్ల బంగారు గొలుసును దొంగిలించుకెళ్లినట్లు తెలిసింది. దీంతో షాక్‌కు గురైన ఆయన ఈ విషయంపై వానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో కుంభకోణానికి చెందిన జగన్నాథన్‌ ( 66) అనే వ్యక్తి నగలు దొంగిలించినట్లు తేలింది. వెంటనే పోలీసులు కుంభకోణం వెళ్లి జగన్నాథన్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం అతనిని వానగరం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. విచారణలో మదురవాయల్‌, నొళంబూర్‌, వానగరం ప్రాంతాల్లోని కల్యాణ మండపాల్లో జరిగే వివాహ వేడుకల్లో నగలు దొంగిలించినట్లు అతను అంగీకరించాడు. దీంతో అతని వద్ద నుండి సుమారు 14.5 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నిందితుడిని పూందమల్లి కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు.

వైద్యురాలి ఇంట్లో

రూ.కోటి బంగారం చోరీ

అన్నానగర్‌ : వేలూరు జిల్లా కాడ్పాడి ఫ్లైఓవర్‌ సమీపంలో ప్రైవేట్‌ కంపెనీ నివాసాలు ఉన్నాయి. ఈ నివాసం కు చెందిన ఇర్విన్‌. ఇతను పదవీ విరమణ చేసిన బ్యాంకు మేనేజర్‌. ఇతని పేరు క్రిస్టియానా. ఆమె రాణిపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌ గా పని చేస్తుంది. ఆదివారం రాత్రి కుటుంబికులు ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒక దొంగల ముఠా ఇంటి వెనుక తలుపును పగలగొట్టి ఇంట్లోకి వెళ్లారు. వారు బిరువను పగులగొట్టి అందులో ఉన్న 50 సవర్ల బంగారం, వజ్రాల ఆభరణాలు దొంగిలించి ఇంటి నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత సమీపంలోని మరో ఇద్దరు డాక్టర్ల ఇళ్లలో దోపిడీకి యత్నించారు. దొంగతనం ప్రయత్నం విఫలమవడంతో, వారు దొంగిలించిన నగలతో పారిపోయారు. సోమవారం ఉదయం నిద్రలేచిన డాక్టర్‌ కుటుంబ సభ్యులు, కార్యాలయం లోకి చొరబడి నగలు దొంగిలించబడటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. డాక్టర్‌ ఇంటి నుండి రూ.కోటి విలువైన బంగారం వజ్రాల ఆభరణాలు దొంగిలించారు. దీని గురించి తిరువళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ తిరునావుక్కరసు, పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.

దీపోత్సవానికి అదనపు బస్సులు

వేలూరు: తిరువణ్ణామలైలో మంగళవారం జరిగే దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు వెల్లే భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు చేయనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి విజయ్‌ తమిళన్‌ పార్థిబన్‌ అన్నారు. సోమవారం ఉదయం వేలూరులోని కొత్త బస్టాండ్‌లో ట్రాఫిక్‌ సమస్యలపై నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దీపోత్సవాన్ని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపద్యంలో వారందిరికీ వేలూరు కొత్త బస్టాండ్‌ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్దంగా చేసినట్లు తెలిపారు. అనంతరం వేలూరు కొత్త బస్టాండ్‌లో ఆక్రమణలు, ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అనే వాటిపై తనఖీ చేశారు. ఆయనతో పాటు వేలూరు కార్పొరేషన్‌ కమిషనర్‌, ట్రాఫిక్‌ పోలీసులు, కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement