తమిళసినిమా: భిన్నమైన మనస్థత్వాల సమాజం మనది. ఇక్కడ ప్రతి ఒక్కరి అభిమతానికీ గౌరవం ఉంటుంది. దైవ పరంగా కొందరు ఆస్థికులు, మరి కొందరు నాస్తికులుగా గడుపుతుంటారు. ఇంకొందరు ఏదో శక్తి ఉందంటారు కానీ పెద్దగా పూజలు పురస్కారాలు చేయరు. నటి కాజల్ అగర్వాల్ ఈ కోవకి చెందుతారని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈమె పరిస్థితే వేరు. ఇంతకు ముందు వరకు పాన్ ఇండియా కథానాయికిగా రాణించిన ఈ భామ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత కూడా నటనను కొన సాగిస్తున్నారు. అయితే కథానాయకిగా అవకాశాలు రావడం లేదు. ముఖ్య పాత్రలు పోషిస్తూ నేనూ ఉన్నాను అనిపించుకుంటున్నారు. అలా ఇటీవల రామాయణం చిత్రంలో మండోదరిగా నటించారు. కాగా ఈమె కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ 2 చిత్రంలో నటించారు. ఆ చిత్ర షూటింగ్ ను 2020లో నిర్వహించిప్పుడు షూటింగ్ స్పాట్ లో భారీ క్రేన్ కిందకి పడిపోయిన ప్రమాదంలో ఒక సహాయ దర్శకుడితో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ స్పాట్ లో నటి కాజల్ అగర్వాల్ ఉన్నారట. ఆ సంఘటన గురించి ఇటీవల ఒక భేటీలో ఆమె పేర్కొంటూ ఇండియన్– 2 చిత్రం షూటింగ్ స్పాట్ లో ప్రమాదం జరిగినప్పుడు 80 ఏళ్ల బామ్మ గెటప్ లో నేను క్రేన్ వెనుక కూర్చుని ఉన్నాను. అప్పుడు కన్ను మూసి తెరసే లోపల ప్రమాదం జరిగింది. దీంతో అందరూ పరుగులు తీశారు. అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో నన్ను ఎవరో చెయ్యి పట్టి లాక్కెళ్లారు. అలా తనను లాక్కెళ్లిఔది వ్యక్తినో , శక్తినో తెలియదు. నన్ను లాగాంది ఎవరు అని అక్కడ ఒక వ్యక్తిని అడిగితే , ఎవరికి వారు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగీలు తీస్తే, మిమ్మల్ని ఎవరు లాగారో తెలియదు అని చెప్పారు. దీంతో ఆశ్చర్యపోయిన నేను ఏదో శక్తి కాపాడిందనే భావనకు వచ్చాను. ఆ తరువాత శ్రీ కృష్ణ భగవాన్ తీవ్ర భక్తురాలి గా మారిపోయారు అని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు.


