తమిళసినిమా: ఈ తరహా పాత్రనైనా తనదైన స్టైల్ లో నటించి మెప్పించగల సత్తా కలిగిన నటుడు ఫాహత్ ఫాజిల్. ఈ మలయాళం నటుడు మాతృభాషతో పాటూ తమిళం, తెలుగు వంటి ఇతర భాషల్లోనూ నటిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. ఈయన తాజాగా తమిళంలో కథానాయకుడుగా నటిస్తున్న చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై డాక్టర్ ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. 96 చిత్రంతో దర్శకుడుగా అవతారం ఎత్తిన ప్రముఖ ఛాయాగ్రహకుడు ప్రేమ్ కుమార్ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కార్తీ ,అరవిందస్వామి కలిసి నటించిన మెయ్యళగన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం మంచి ప్రశంసలతో పాటూ కమర్షియల్ గాను విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా నటుడు ఫాహత్ ఫాజిల్ హీరోగా వేల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని 2027 జనవరి 1వ తేదీన విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అధికారికంగా పేర్కొన్నారు. ఈ చిత్రానికి అశరీరి అనే టైటిల్ ఖరారు చేశారు. థ్రిల్లర్ కథతో రూపొందుతున్న ఇందులో ఫాహత్ ఫాజిల్ జంటగా నటి శివదా నటించగా నటుడు సీత హరీష్ ఉత్తమం కరుణాకరన్ చరణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణంను, గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొంటున్నాయని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.


