27న తెరపైకి నైల్లెబాయ్స్‌ | - | Sakshi
Sakshi News home page

27న తెరపైకి నైల్లెబాయ్స్‌

Nov 24 2026 1:24 AM | Updated on Nov 24 2026 1:24 AM

తమిళసినిమా: ఇటీవల దక్షిణ తమిళనాడులో జరిగిన పరువు హత్యల సంఘటన నేపథ్యంలో రూపొందిన చిత్రం నైల్లె బాయ్స్‌. ఇంతకు ముందు అరువా సండై చిత్రాన్ని నిర్మించిన వీ. రాజా తన వైట్‌ స్క్రీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించిన తాజా చిత్రం ఇది. ఈ చిత్రానికి కథ ,కథనం, మాటలు , ఎడిటింగ్‌ ,దర్శకత్వం బాధ్యతలను కమల్‌. జి నిర్వహించారు. ఈ నాగరిక ప్రపంచంలో మనుషులు వేరు వేరు పరిమాణాల్లో జీవిస్తున్నా, కుల మతాలకతీతమైన వివాహాలను మాత్రం అంగీకరించే మనస్తత్వాన్ని పెంపొందించుకోలేని పరిస్థితి. దీంతో ఇప్పటికీ సమాజంలో పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి హత్యలు తమిళనాడులో ముఖ్యంగా దక్షిణాది తమిళ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటి క్రూరమైన పరువు హత్యల నేపద్యంలో తెరకెక్కించిన కథా చిత్రం నైల్లె బాయ్స్‌ అని దర్శకుడు కమల్‌ .జి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దయ్యా దాక్షిణ్యాలు లేనివారిని కూడా కదిలించే ఇతి వృత్తంతో కూడిన కాథా చిత్రంగా నైల్లె బాయ్స్‌ ఉంటుందన్నారు. ఇందులో ప్రేమ మాత్రమే కాకుండా స్నేహం కూడా ప్రధాన అంశంగా ఉండే ఈ చిత్రం నైల్లె సీమకు అద్దం పట్టేలా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా హేమ రాజకుమార్‌ కథానాయకుడుగా పరిచయం అవుతున్నారు. ప్రతి నాయకుడుగా వేల రామ్మూర్తి నటించారు. ఈ చిత్ర టైటిల్ను, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను, ఇటీవల విడుదల చేయగా రకరకాల విమర్శలు ఎదురైయ్యాయి అని అన్నారు. రశాంత్‌ అరవిన్‌ సంగీతాన్ని, రవీంద్రన్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, చిత్రాన్ని ఈ నెల 27 తేదీన విడుదల చేయనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement