తమిళసినిమా: కె స్క్వేర్ సినిమాస్ పతాకంపై కె బిందు మాధవి నిర్మించిన చిత్రం నిరమ్. బలరాం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ముగెన్ రావ్ కథానాయకుడుగా నటించారు. నటి ప్రీతి అస్రాణి, తాన్య హోప్ ,నితిన్ సత్య ,సురేఖ వాణి ,శ్రీజిత్ రవి, అన్బు మయిల్ స్వామి, తిరుణావుక్కరసు, గజరాజ్, స్నేహ గుప్తా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జితేష్ సాయి సమర్పకుడిగా వ్యవహరించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నిరమ్ ఈనెల 27వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు పేర్కొంటూ ఇది వైద్యశాఖలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు యదార్ధ సంఘటనలను తెరపై ఆవిష్కరించిన కథ చిత్రం అని చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని పేర్కొన్నారు దీంతో నిరమ్ మంచి చిత్రంపై ఆసక్తి నెలకొందానే భావనను వ్యక్తం చేశారు. చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కనిపిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. డీ. ఇమాన్ సంగీతాన్ని శాండోనియో టెర్జియో ఛాయాగ్రహణం అందించిన నిరమ్ చిత్రాన్ని ఈనెల 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.


