మూపనార్‌కు నివాళి | - | Sakshi
Sakshi News home page

మూపనార్‌కు నివాళి

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

– సేవలలో టీఎంసీ వర్గాలు

సాక్షి, చైన్నె: తమిళ మానిల కాంగ్రెస్‌ వ్యవస్థాపకుడు, సీనియర్‌ రాజకీయ నేత, దివంగత జీకే మూపనార్‌ 25వ వర్ధంతిని పురస్కరించుకుని వివిధ పార్టీల నాయకులు ఆయన స్మారకం వద్ద నివాళులర్పించారు. తమిళ మానిలా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జికే వాసన్‌ నేతృత్వంలో డీఎంఎస్‌ సమీపంలోని స్మారకంవద్ద ప్రత్యేక అలంకరణలు, సేవా కార్యక్రమాలు జరిగా యి. కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్‌, మాజీ అధ్యక్షుడు తంగబాలుతో పాటుగా వివిధ పార్టీల నేతలు స్మారకంవద్ద పుష్పాంజలి ఘటించారు. టీఎంసీ వర్గాలు సేవలలో నిమగ్నమయ్యారు. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి జీఆర్‌ వెంకటేషన్‌ నేతృత్వంలో ఎస్‌ఆర్‌ కాస్టిల్‌ ప్రాంగణంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. మూపనార్‌ చిత్ర పటానికి అంజలి ఘటించారు. పేదలకు సహాయకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి రఘు, మోహన సుందరం, పార్థ సారథి, శరవణన్‌, రవి, ఎం. పళణియప్పన్‌, ఎస్‌ఆర్‌ కాస్టిల్‌ రవి, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement