తిరువొత్తియూరు: తిరువళ్లూరు రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధన మహోత్సవ వేడుకల్లో భాగంగా కుత్తువిళక్కు జ్యోతి పూజ నిర్వహించారు. తిరువళ్లూరు కోనేరు గట్టు వీధిలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో, శ్రీ రాఘవేంద్ర స్వామిగారి 355వ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ సత్యనారాయణ పూజ నిర్వహించారు. ఇక ఆదివారం ఉదయం 7 గంటలకు మహా హోమం, ఉదయం 9 గంటలకు పవమాన హోమం, మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదానం జరిగాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సంగీత కార్యక్రమం, రాత్రి 7 గంటలకు మహా దీపోత్సవం నిర్వహించారు.


