కొరుక్కుపేట: అన్నాడీఎంకే విధానాలు, విజయాలు, ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్రమంతటా ప్రచారం సాగించే దిశగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) ఆపార్టీ ప్రచార విభాగం డిప్యూటీ కార్యదర్శిగా ట్రానన్స్ జెండర్ అప్సరా రెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా అప్సరారెడ్డి మాట్లాడుతూ పార్టీ ప్రచార విభాగం నేతగా చేపడుతున్న ఈ కొత్త బాధ్యత మరింత కష్టపడి పనిచేసి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి గొప్ప ప్రేరణ ఇస్తుందని అన్నారు. మాజీ ముఖ్య మంత్రులు , పురట్చి తలైవర్ ఎంజీఆర్ ఉన్నత ఆదర్శాలను.. పురటితలైవి జయలలిత అమలు చేసిన ప్రజా సంక్షేమ విధానాలను, ఈపీఎస్ దార్శనికతలను మార్గదర్శకంగా తీసుకుని పార్టీని మరింత పటిష్టం చేయడానికి శాయశక్తులా పాటుపడతానని తెలిపారు.


