రెవెన్యూ ఉద్యోగుల రాస్తారోకో
తిరువళ్లూరు: రెవెన్యూ విభాగంలోని విలేజ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దశల వారీగా ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో సోమవారం ఉదయం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించారన్న నెపంతో 17 మంది మహిళ ఉద్యోగులతో సహా 88 మందిని అరెస్టు చేశారు. తిరువళ్లూరులో జరిగిన ఆందోళనకు డివిజన్ కార్యదర్శి వేణు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేజ్ అసిస్టెంట్‌లకు క్రమబద్ధీకరించిన వేతనాలను ఇవ్వాలని వారు నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో సంఘం నేతలు కన్నన్, రజిని, కందన్, నిజాముద్దీన్, రాధాకృష్ణన్ పాల్గొన్నారు.


