తిరుమలలో చలువ పందిళ్లు | - | Sakshi
Sakshi News home page

తిరుమలలో చలువ పందిళ్లు

Feb 24 2026 7:34 AM | Updated on Feb 24 2026 7:34 AM

తిరుమలలో చలువ పందిళ్లు

తిరుమలలో చలువ పందిళ్లు

తిరుమల: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తులు క్యూలో వేచి ఉండే సమయంలో ఎండ ప్రభావం తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో చలో పందిళ్లు (తాత్కాలిక షెడ్లు) ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండడంతో, ముఖ్యంగా వేసవి కాలంలో సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులు నిర్ణయించారు. క్యూ కాంప్లెక్స్‌ పరిసర ప్రాంతాలు, నాలుగు మాడ వీధులు తదితర ప్రాంతాల్లో పందిళ్లు ఏర్పాటు చేసి నీటి సరఫరా, వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంచారు. భక్తులు ఈ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఎండ నుంచి రక్షణ కల్పించడం వల్ల వేచి ఉండే సమయం సౌకర్యంగా మారిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement