మారిషస్ మంత్రికి సత్కారం
సాక్షి, చైన్నె: హెఐటీఎస్‌లో మారిషస్ మంత్రి రాజేన్ నర్సింహన్‌ను ఘనంగా సత్కరించారు. తమిళ సంస్కృతి, వ్యవసాయ వారసత్వం చాటే విధంగా విద్యార్థుల సృజనాత్మకత కార్యక్రమం, మెగా పొంగల్ వేడుక హెచ్‌ఐటీఎస్ పరిధిలోని కేసీజీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బుధవారం జరిగింది. ఇందులో మారిషస్ ప్రభుత్వ విదేశాంగ, ప్రాంతీయ సమైఖ్యత, అంతర్జాతీయ వాణిజ్య మంత్రి రాజేన్ నర్సింహన్ పాల్గొన్నారు. తమిళ వారసత్వం, విద్యార్థుల సృజనాత్మకను ఆయన వీక్షించారు. అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐటీఎస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆనంద్ జాకబ్ వర్గీస్‌తో పాటూ ముఖ్య నిర్వాహకులు ఉత్తమ సేవలకు గాను మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు.


