ఘనంగా పొంగల్ వేడుకలు
వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు బుధవారం ఉదయం భోగి మంటలతో అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో ప్రయాణికులు సొంత ఊర్లకు వెళ్లేందుకు తరలిరావడంతో బస్టాండ్ కిక్కిరిసింది. ట్రాన్స్‌పోర్టు అధికారులు జిల్లాలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి సంఘటనలో చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
అలాగే మార్కెట్‌కు భారీగా చెరుకు, అరటి, ఇతర పూజా సామగ్రి చేరింది. ఈ క్రమంలో వేలూరు నేతాజీ మార్కెట్ కొనుగోలు దారులతో కిటకిటలాడింది. వేలూరు సమీపంలోని పొయిగై సంతలో పశువుల వ్యాపారం జోరుగా సాగింది. పందెంరాయుళ్లు అధిక సంఖ్యలో కోడి పుంజులను కొనుగోలు చేశారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో..
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రతాప్ ఎద్దుల బండిపై వేడుకలకు హాజరయ్యారు. ఉద్యోగులకు వేర్వేరుగా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ ఉట్టి కొట్టి అందరిని ఉత్సాహపరిచారు. కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులకు చీరలు, యూనిఫామ్ పంపిణీ చేశారు.
పసుపు మొలకలను కొనుగోలు చేస్తున్న మహిళ
భోగి మంట వద్ద యువకులు
చెరుకు లోడ్‌తో మార్కెట్‌కు వస్తున్న లారీ
మంచు కారణంగా ఆలస్యంగా వస్తున్న రైలు
తిరువళ్లూరులో భోగి మంట
ఎద్దుల బండిపై కలెక్టర్ ప్రతాప్
ఘనంగా పొంగల్ వేడుకలు
ఘనంగా పొంగల్ వేడుకలు
ఘనంగా పొంగల్ వేడుకలు
ఘనంగా పొంగల్ వేడుకలు
ఘనంగా పొంగల్ వేడుకలు


