అలరించిన నృత్య ప్రదర్శన
కొరుక్కుపేట : చైన్నె మైలాపూర్‌లోని కాపాళీశ్వరర్ ఆలయం వేదికగా శ్రీభారత్ కళా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్గళి మ్యూజిక్ డాన్స్ అండ్ ఫెస్టివల్‌ను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి , భరతనాట్యం ఆకట్టుకుంది. అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్, గురువు రోజారాణి, ఆర్గనైజర్, డైరెక్టర్ దుర్గా నటరాజ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవం చేపట్టారు. గురువు సత్యప్రియా రమణ నేతృత్వంలో ఘంటసాల మనుమరాలు, నర్తకి డాక్టర్ లలిత్యా కొండూరు, కేరళకు చెందిన ప్రియా బాబు కూచిపూడి నృత్య ప్రదర్శన మంత్రముగ్ధం చేసింది. అలాగే నాట్య రంజన స్కూల్ ఆఫ్ భరతనాట్యం డైరెక్టర్ గురువు కలైమామణి డాక్టర్ ప్రియా కార్తికేయన్ సారథ్యంలో కీర్తన ప్రదీప్ , శ్రేయా అరవింద్, ససత్య కుసుమారన్, శుభవి రమేష్ భరత నాట్య ప్రదర్శన మైమరిపించింది. ముఖ్య అతిథిగా హాజరైన మాధవి మళ్లెంపల్లితోపాటు రోజారాణి , దుర్గా నటరాజ్ చేతులమీదుగా నర్తకీమణులు, గురువులను ఘనంగా సత్కరించారు.


