కమనీయం.. కల్యాణం
తిరుపతి కల్చరల్ : ధనుర్మాసం ముగింపు సందర్భంగా అన్నమాచార్య కళామందిరంలో బుధవారం కమనీయంగా గోదాదేవి కల్యాణం జరిపించారు. ముందుగా గోదాదేవి(ఆండాళ్), రంగనాథస్వామివారి ఉత్సవర్లను వేదికపై కొలువు తీర్చా రు. అనంతరం శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టం నిర్వహించారు. కళాకారులు నిర్వహించిన గోదాదేవి కల్యాణ నృత్య రూపకం ఆకట్టుకుంది.
ముగిసిన తిరుప్పావై
టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గత ఏడాది డిసెంబర్ 16 నుంచి నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచనాలు బుధవారంతో ముగిశాయి. చివరిరోజున తిరుపతికి చెందిన పండితులు చక్రవర్తి రంగనాథన తిరుప్పావై ప్రచవనాలు వినిపించారు. టీటీడీ ఎఫ్‌ఏసీఏఓవో ఓ.బాలాజీ, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ పురుషోత్తం, ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోకిల పాల్గొన్నారు.
కమనీయం.. కల్యాణం


