వైభవంగా ఊంజల్ సేవ
తిరుపతి కల్చరల్ : నగరంలోని బండ్ల వీధిలో వెలిసిన రాముల వారి గుడి భజన మందిరంలో బుధవారం వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ధనుర్మాస భజన పూజలు ముగింపు సందర్భంగా సీతారామలక్ష్మణులు, ఆంజనేయ స్వామివారి ఉత్సవర్లను కొలువుదీర్చి విశేష పూజలు జరిపించారు. లక్ష్మీనారాయణ హార్డ్‌వేర్స్ అధినేత తొండమనాటి వెంకటేష్‌రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేపట్టారు. మేయర్ డాక్టర్ శిరీష ఊంజల్ సేవకు హాజరయ్యారు.
ఆలయ ధర్మకర్త పులిగోరు ప్రభాకర్‌రెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీరెడ్డి, రంగస్థలి చైర్మన్ గోపీనాథ్‌రెడ్డి , భూషణ్‌రెడ్డి, చంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, జయమ్మ, నాగరత్న, కేశవరెడ్డి, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.


