సమత్తువ పొంగల్
సాక్షి, చైన్నె : సమత్తువ పొంగల్ వేడుక మిన్నంటింది. సచివాలయంలో ప్రప్రథమంగా ఈ వేడుక బుధవారం జరిగింది. సీఎం స్టాలిన్ ఉద్యోగులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. సీఎం స్టాలిన్ పట్టు, పంచె, చొక్కా ధరించి వచ్చారు. వివరాలు.. రాష్ట్రవ్యాప్తంగా సమత్తువ పొంగల్ వేడుక మిన్నంటింది. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో , ప్రైవేటు సంస్థలలో సమానత్వాన్ని చాటే విధంగా అందరూ కలిసి కట్టుగా పొంగల్ సంబరాలలో మునిగారు. పూజలలోనే కాదు ఆట పాటలతో సందడి చేశారు. ఆ దిశగా ప్రప్రథమంగా చైన్నెలోని సచివాలయంలో జరిగిన సమానత్వ పొంగల్ ఈ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఉద్యోగులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. పట్టు పంచె , చొక్క ధరించి వచ్చిన ఆయన ఉద్యోగులతో మమేకం అయ్యారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరితో కలిసి పొంగలి తయారీలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందంతో పాటుగా పలువురు ఐఎఎస్ అధికారులు, ఇతర విభాగాల ముఖ్య అధికారులు తెల్ల చొక్కా, పంచె ధరించి పండుగ ఆనందాన్ని ఉద్యోగులతో పంచుకున్నారు. మంత్రులు ఎం. సుబ్రమణియన్, అన్బిల్ మహేశ్, శేఖర్‌బాబు, స్వామినాధన్, మనో తంగరాజ్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పొంగలి తయారు చేశారు. పొంగలిని సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ పంచి పెట్టారు. ఈ సందర్భంగా నాధస్వర సంగీత కార్యక్రమం జరిగింద.ఇ ఈసందర్భంగా సీఎం స్టాలిన్ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాల అధిపతులు, ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు ,చీఫ్ సెక్రటేరియట్ అధికారులకు పలకరించారు. కింది స్థాయిఉద్యోగులతో కరచాలనం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, తాము తమిళనాడు అంతటా సమానత్వ పొంగల్ జరుపుకుంటామన్నారు. అందరికీ అన్నీ అనే లక్ష్యం దిశగా పని చేస్తున్నామన్నారు. అందరికీ సమానత్వం సాధించాలనే లక్ష్యంతో ద్రవిడ మోడల్ ప్రభుత్వం పని చేస్తోందరన్నారు. ఇంకా చెప్పాలి అంటే, అందరం కలిసి కట్టుగా తమిళనాడు ప్రజల అవసరాలను తీర్చగల నాయకత్వంతో ముందుకెళ్తున్నామన్నారు. సచివాలయంలోని అందరూ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారుని కితాబు ఇచ్చారు. అందరితో కలిసి ఆనందాన్ని పంచుకుంటూ ఈ వేడుకలో ప్రప్రథమంగా ఇక్కడ పాల్గొనడం ఓ తీపి గుర్తుగా వ్యాఖ్యలు చేశారు. అందరూ తమ తమ ఇళ్లలో ఆనందంతో, ఉత్సాహంతో పొంగల్ పండుగ చేసుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
సమత్తువ పొంగల్


