3 దశాబ్దాల ప్రయాణం స్ఫూర్తిదాయకం
సాక్షి, చైన్నె : రైతుల భాగస్వామ్యంతో 3 దశాబ్దాల ప్రయాణం స్పూర్తి దాయకంగా జరిగిందని సోనాలికా వైస్ చైర్మన్ ఎఎస్ మిట్టల్ తెలిపారు. ఈ 30 సంవత్సరాల నమ్మకం, స్పూర్తి, శక్తితో రూపకల్పన చేసిన విజయగాథ పుస్తకాన్ని స్థానికంగా ఆవిష్కరించారు. చిన్న పట్టణంలో మొదలైన ఈప్రయాణం తాజాగా దేశంలో నంబర్ –1 ట్రాక్టర్ల ఎగుమతి బ్రాండ్‌గా , దేశంలో 3వ అతి పెద్ద ట్రాక్టర్ తయారీ దారుగా, ప్రపంచంలో 5వ అతి పెద్ద ట్రాక్టర్ బ్రాండ్‌గా అవతరించినట్టు ఈసందర్భంగా మిట్టల్ వివరించారు. 2011 నుంచి తన నాయకత్వంలో ఇంజిన్లు, ట్రాన్స్ మిషన్‌లు, గేర్ బాక్స్‌లు, షీట్ మెటల్, కీ అగ్రి గేట్లను అంతర్గతంగా తయారు చేయడంలో , సామర్థ్యాలను పెంచడంలో ముందుకెళ్లినట్టు పేర్కొన్నారు. రైతులు ఇచ్చిన మద్దతు, ప్రోత్సహం, సహకారంతో నేడు మూడు దశాబ్దాల విజయ గాథను జరుపుకుంటున్నామని ఆనందం వ్యక్తంచేశారు.


