ఎన్నో చేదు అనుభవాలున్నాయి..!
తమిళసినిమా: ఈ ఆధునిక కాలంలో కూడా మహిళలు అనాగరీక వేధింపులకు గురౌతూనే ఉన్నారంటే సమాజం ఎటు పోతోందో అర్థం కాని పరిస్థితి. ఉదాహరణకు నటి భావనకు ఆ మధ్య జరిగిన సంఘటననే చెప్పుకోవచ్చు. మానభంగం ఘటనలో ఆమె కోర్టు వరకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. కాగా నటి పార్వతి కూడా వేధింపులకు గురైనట్లు ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. తమిళంలో పూ చిత్రంతో కథానాయికిగా పరిచయం అయిన ఈ మలయాళ భామ ఆ తరువాత మరియాన్, చైన్నెయిల్ ఒరు నాళ్, తంగలాన్ తదితర చిత్రాల్లో నటించారు. చివరగా ఈమె తంగలాన్ చిత్రంలో విక్రమ్ భార్యగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మలయాళంలో ప్రముఖ కథానాయికిగా రాణిస్తున్న ఆమె వ్యక్తిగతంగా చాలా బోల్డ్, అదేవిధంగా తన భావాలను నిర్భయంగా వ్యక్తం చేసే నటి. ఒక నటిగా, మహిళగా తన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, వేధింపుల గురించి వ్యక్తం చేశారు. తాను బాల్యంలోనే పురుష దురహంకారానికి గురైనట్లు చెప్పారు. రైల్వే స్టేషన్‌లో అనూహ్యంగా ఒక యువకుడు వచ్చి తన గుండెలను బలంగా గుద్దారన్నారు. అతను అలా ఎందుకు చేశాడో తనకు అర్థం కాలేదన్నారు. ఆ తరువాత ఒక సారి విమానాశ్రయంలో ఒక వ్యక్తి తనను చూసుకుంటూ ముందుకు వెళ్లాడని, దీంతో అలా ఎందుకు చూశావని అడిగి లాగి చెంపదెబ్బ కొట్టా ఠిని, దీంతో అక్కడ సెక్యూరిటీ అధికారి నివ్వెర పోయి ఎందుకు కొట్టారని అడిగారన్నారు. తాను విషయం చెప్పినా తన వద్ద ఆధారం లేకపోయిందని, అయినా మీరే కొట్టారు కాబట్టి వదిలేయండి అని ఆయన వెళ్లి పోయారని, అయితే అక్కడ ఉన్న వారంతా తనను అభినందించారని చెప్పారు. అదే విధంగా ధనుష్ కు జంటగా మరియాన్ చిత్రంలో నటించిన సమయం చాలా అసౌకర్యానికి గురైనట్లు చెప్పారు. ఒక సన్నివేశాంలో ధనుష్ తో కలిసి సముద్రంలో మునిగే సన్నివేశాలలో నటించానని, ఆ తరువాత దుస్తులు మార్చుకోవడానికి తనకు సహాయకులు కూడా లేరన్నారు. అది తనకు పీరియడ్ సమయం అని, దీంతో తాను హోటల్ గదికి వెళ్లి దుస్తులు మార్చుకుని వస్తానని గట్టిగా చెప్పినా యూనిట్ సభ్యులు ఒప్పుకోలేదని, అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు నటి పార్వతి చెప్పారు.


