రేపటి నుంచి నమ్మ ఊరు ఉత్సవం
సాక్షి, చైన్నె: చైన్నె సంగమం, నమ్మ ఊరు ఉత్సవం పేరిట గొప్ప కళా ఉత్సవం మూడురోజులపాటు నిర్వహించనున్నామని డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి తెలిపారు. ఎగ్మూర్ ప్రభుత్వ మ్యూజియం ఆడిటోరియంలో మంగళవారం కో–ఆప్టెక్స్ ఎండీ కవిత, సంస్కృతి విభాగం డైరెక్టర్ ఎస్.వలర్మతితో కలసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఉత్సవాన్ని రాజరత్నం స్టేడియంలో బుధవారం రాత్రి సీఎం స్టాలిన్ ప్రారంభిస్తారని ప్రకటించారు. 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చైన్నె, తాంబరం, ఆవడి కార్పొరేషన్ల పరిధిలో 20 చోట్ల వేడుకలు జరుగుతాయని వివరించారు. 17వ తేదీ శనివారం సాయంత్రం చైన్నె మ్యూజియం ప్రాంగణంలోని నేషనల్ గ్యాలరీ బ్రహ్మాండ వేడుకగా కళా ఉత్సవం జరుగుతుందని తెలిపారు.


