మద్యం మత్తులో స్కూల్ బస్సు నడిపిన డ్రైవర్
పళ్లిపట్టు: పళ్లిపట్టు తాలూకాని ఆర్కేపేట రోడ్డు బలిజికండ్రిగ వద్ద ఓ ప్రయివేటు పాఠశాల వుంది. ఆ పాఠశాలలో పళ్లిపట్టు పరిసర ప్రాంతాల నుంచి విద్యార్ధులు పాఠశాల బస్సులో వెళ్లి చదువుకుంటున్నారు. యథాప్రకారం సోమవారం ఉదయం పొదటూరుపేట నుంచి 25 మంది విద్యార్థులను ఎక్కించుకుని జంగాళపల్లె గ్రామంలోకి వెళ్లారు. విద్యార్థులను ఎక్కించిన తర్వాత డ్రైవర్ వద్ద తల్లిదండ్రులు మాట్లాడగా మద్యం మత్తులో వున్నట్లు గుర్తించి అనుమానంతో ప్రశ్నించారు. సమాధానం ఇవ్వక పోవడంతో ఆగ్రహం చెందిన యూనిఫాం లేకుండా మద్యం మత్తులో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు ఆరోపిస్తూ బస్సును దిగ్బంధించారు. విద్యార్ధులు బస్సులో వేచివుండాల్సి రావడంతో వెంటనే పోలీసులతో పాటు పాఠశాల నుంచి సిబ్బంది చేరుకుని గ్రామీణులతో మాట్లాడారు. మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసి విద్యార్ధులతో బస్సును పాఠశాలకు తీసుకెళ్లారు. మధ్యం మత్తులో వుండిన ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా పాలసముద్రంకు చెందిన బస్సు డ్రైవర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


