కొత్త ప్రయత్నం, కొత్త ట్రీట్‌మెంట్
నటుడు జీవాతో తలైవన్ తంబి తలైమైయిల్ చిత్ర యూనిట్
తమిళసినిమా: జీవా కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తలైవన్ తంబి తలైమైయిల్. కన్నన్ రవి కుళుమమ్ పతాకంపై కన్నన్ రవి నిర్మించిన చిత్రం ఇది. దీపక్ రవి సహజమాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి రితీష్ సహదేవ్ దర్శకత్వం వహించారు. ప్రార్థన నాదన్ నాయికిగా నటించిన ఇందులో తంబి రామయ్య, ఇళవరసు ,జయవంత్, జాన్సన్ దివాకర్, మణిమేఘలై తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బబ్లూ అజూ ఛాయాగ్రహణం, విష్ణు విజయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 15వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆశ్రయం కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు జీవా మాట్లాడుతూ,ఈ చిత్రం నిజంగా ఒక మ్యాజిక్ అని పేర్కొన్నారు. తన మిత్రుడు , నటుడు వీటీవీ గణేష్ గత ఏడాది ఏప్రిల్ లో తన ఇంటికి వచ్చి మలయాళంలో విడుదలైన ఫొలమి చిత్రం గురించి చెప్పారన్నారు. అయితే ఆ చిత్ర తమిళం రీమేక్ గురించి ఆ చిత్ర నిర్మాతలు అంతకు ముందే తనతో మాట్లాడారని చెప్పారు. ఆ తరువాత దర్శకుడు రితీష్ సహదేవ్ తనను కలిసి కథ చెప్పగానే నచ్చడంతో అంగీకరించినట్లు చెప్పారు. ఇది గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా ఇది తన 45వ చిత్రం అని, దీని షూటింగ్‌ను 46 రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. కొత్త ప్రయత్నం, కొత్త ట్రీట్ మెంట్‌తో రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. నిజానికి ఈ చిత్రాన్ని జనవరి 30వ తేదీన విడుదల చేయాలని భావించామని, అయితే ఈ నెల15 వ తేదీనే విడుదల చేసే అవకాశం వచ్చిందని జీవా చెప్పారు.
కొత్త ప్రయత్నం, కొత్త ట్రీట్‌మెంట్


