ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం కేసులో మరో నిందితుడి అరెస్టు
తిరువొత్తియూరు: స్టాక్ మార్కెట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి పదవీ విరమణ పొందిన ఐఎఫ్‌ఎస్ అధికారి నుంచి రూ. 6.58 కోట్లు మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న ఈరోడ్‌కు చెందిన వ్యక్తిని చైన్నె సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె వేలచ్చేరికి చెందిన పదవీ విరమణ పొందిన ఐఎఫ్‌ఎస్ అధికారి కృష్ణకుమార్ కౌశల్ (60). అతనికి వాట్సాప్ ద్వారా వచ్చిన పార్ట్ టైమ్ ఉద్యోగం , స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడికి సంబంధించిన సందేశాన్ని మోసగాళ్ల ముఠా పంపింది. అందులోని సమాచారం ఆధారంగా ఓ లింక్ ద్వారా నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ ద్వారా పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందవచ్చని గుర్తు తెలియని వ్యక్తులు ఆశ చూపారు. వారి మాటలు నిజమని నమ్మిన బాధితుడు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు 6 కోట్ల 58 లక్షల రూపాయలు చెల్లించారు. అయితే ఆ తర్వాత తాను మోసపోయానని తెలుసుకుని చైన్నె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి ఈ కేసులో సంబంధమున్న రామ్ గోపాల్ సింగ్, ముఖేష్ అశోక్, తేడియా భవన్ సన్ ముఖ్ తదితరులు సహా 9 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. బాధితుడు కోల్పోయిన డబ్బులో కొంత భాగాన్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, ఈ కేసులో సంబంధమున్న మరో ముఖ్యమైన వ్యక్తి ఈరోడ్ ప్రాంతంలో దాగి ఉన్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందం పోలీసులు ఈరోడ్‌కు వెళ్లి అక్కడి ఒండిపాళయంకు చెందిన మాదేశ్ కుమార్ (41) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
టెక్నాలజీపై రికార్డు స్థాయిలో పెట్టుబడులు
సాక్షి, చైన్నె: టెక్నాలజీపై పెట్టుబడుల భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉన్నట్టు సెబీ ప్రకటించింది. ఏఎన్‌ఎంఐ 15వ అంతర్జాతీయ మూల ధన మార్కెట్ సమావేశం, భారత దేశ మూల ధన మార్కెట్లో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు, టెక్నాలజీ, భాగస్వామ్యంపై చైన్నెలో సదస్సు జరిగింది. ఇందులో రిటైల్ భాగస్వామ్యం పెరుగుదల, విశ్వాసం, ఆర్థిక చేరికకు చిహ్నం, పర్యావరణ వ్యవస్థ, స్థితి స్థాపకత బలోపేతం, డిజిటల్ మౌలిక సదుపాయాలకు పెరుగుతున్న ప్రాధాన్యతను గురించి చర్చించారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎకై ్స్చంజెస్ మెంబర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు సెక్యూరిటీస్ అండ్ ఎకై ్చంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) చైర్మన్ తుహిన్ కాంత్ పాండే హాజరై మాట్లాడుతూ, భారత దేశ మూలధన మార్కెట్లు అపూర్వమైన స్థాయిలో భాగస్వామ్యాన్ని చూపుతున్నాయని వివరించారు. సాంకేతికత ఆధారిత నియంత్రణ, సమ్మతి సౌలభ్యం, పెట్టుబడిదారుల రక్షణ, అంచంచలమైన దృష్టి గురించి ప్రస్తావించారు. ఎఫ్‌వై 20లో ప్రత్యేక మైన పెట్టుబడి దారుల సంఖ్య 4.3 కోట్ల నుంచి 13.7 కోట్లకు పెరిగిందని వివరించారు. టెక్నాలజీ, కృత్రిమ మేథస్సు, సైబర్ స్థితిస్థాపకత గురించి ఈ సందర్భంగా విశదీకరించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఎండీ నెహల్ వోర్గా, నేషనల్‌స్టాక్ ఎకై ్స్చంజ్ ఆఫ్ ఇండియా ఎండి ఆశీష్ కుమార్ చౌహాన్, బీఎస్‌ఈ ఎండీ సుందరరామన్ మూర్తి, ఎన్‌సీడీఈఎక్స్ ఎండీ అరుణ్ రాస్తే, ఎన్‌ఎస్‌డీఎల్ ఎండీ విజయ్ చందోక్, ఏఎన్‌ఎంఐ డైరెక్టర్ హేమంత్ కక్కర్, జాతీయ అధ్యక్షుడు కృష్ణమూర్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
బీచ్‌లలో చెత్త వేస్తే
రూ. 5 వేలు జరిమానా
సాక్షి, చైన్నె : చైన్నెలోని బీచ్‌లలో చెత్త వేస్తే రూ. 5 వేలు జరిమానా విధించేందుకు కార్పొరేషన్ సిద్ధమైంది. చైన్నెలో తిరువొత్తియూరు,ఎన్నూరు, మె రీనా, పట్టినంబాక్కం, బీసెంట్ నగర్, నీలాంకరై తదితర బీచ్‌లు ఉన్నాయి. శివారులలోకోవలం, మహాబలిపురం బీచ్‌లు ఉన్నాయి. ఈ బీచ్‌లలో నిరంతరం చెత్త చెదారాలు ఎక్కువే. సముద్రంలో చేరే చెత్త ఓ ఎత్తు అయితే, ఒడ్డున ఉన్న చెత్తమరో ఎత్తు. తరచూ వివిధ సంఘాలు, సంస్థలు చెత్తను తొలగించడంలో నిమగ్నం అవుతాయి. టన్నుల కొద్ది చెత్తను తొలగించడం జరుగుతున్నది. ఈపరిస్థితులో ఇక మీదట మెరీనా, బీసెంటర్ నగర్ తదితర బీచ్‌లకు వచ్చేవారు ఆ పరిసరాలను అపరిశుభ్రంగామార్చే విధంగా వ్యవహరించినా, ఎక్కడ బడితే అక్కడ చెత్తా చెదారాలు వేసినా ఇక జరిమాన విధించే విధంగా చర్యలకు సిద్దమయ్యారు. చెత్తలను అక్కడక్కడ ఏర్పాటు చేసిన కుండీలలో ఏర్పాటు వేయాలే గానీ పరిసరాలను అపరి శుభ్రం చేసే విధంగా వ్యవహరించే వారి నుంచి రూ. 5 వేలు జరిమానా విధించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసం కేసులో మరో నిందితుడి అరెస్టు


