విగ్రహ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

విగ్రహ ఆవిష్కరణ

Jan 12 2026 7:30 AM | Updated on Jan 12 2026 7:30 AM

విగ్రహ ఆవిష్కరణ

విగ్రహ ఆవిష్కరణ

జల్లికట్టు విగ్రహం

సేలం: తమిళుల పరాక్రమం, నేల పరిమళం, ఎద్దుల మహిమలను ఒకచోట చేర్చి సేలం జిల్లాలోని కూలమేడు గ్రామంలో ఆదివారం జల్లికట్టు ఎద్దు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమిళుల ప్రతీక అయిన జల్లికట్టు అనే వీరోచిత క్రీడ గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం జరిగింది. ఆతూర్‌, కూలమేడు గ్రామాల ప్రజలు మరియు కూలమేడు జల్లికట్టు ఉత్సవ బృందం తరపున ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తమిళనాడు జల్లికట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రాజశేఖరన్‌ ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరై జల్లికట్టు ఎద్దు విగ్రహాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు జల్లికట్టు సంఘం మధురై జిల్లా ఇనన్‌చార్జి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కూలమేడు నేలపై ఈరోజు ప్రతిష్టించిన జల్లికట్టు ఎద్దు విగ్రహం తమిళుల ధైర్యసాహసాలను తరతరాలకు తెలియజేసే చారిత్రక చిహ్నంగా ఎప్పటికీ నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

ప్రపంచానికి

తమిళ ఔన్నత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement