అభిమానులు జీవితంలో ఎదగాలి..!
జననాయకన్ విడుదల కాకపోవడంతో..!
తమిళసినిమా: సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో సినిమాల సందడి పెద్దఎత్తున ఉంటుంది. కాగా ఈ సంక్రాంతికి కోలీవుడ్లో రెండే రెండు చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. వాటిలో ఒకటి విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్, మరొకటి శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి. వీటితో పాటూ టాలీవుడ్ నటుడు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ కూడా చేరింది. దీంతో ఈ సారి సంక్రాంతి అదిరిపోతుంది అనుకున్నారు. అంతే కాదు లిపిలో ఎవరిది పై చెయ్యి అవుతుందనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ మూడు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రాలే కావడం. అంతే కాకుండా జననాయకన్ నటుడు విజయ్ నటించిన చివరి చిత్రం కావడం కూడా ఈ ఎగ్జైట్ మెంట్‌కు కారణం. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా సెన్సార్ సమస్యల కారణంగా జననాయకన్ చిత్రం విడుదల వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరుస కడుతున్న మరిన్ని చిత్రాలు
జననాయకన్ అనే ఒక్క చిత్రం వాయిదా పడడంతో ఇప్పుడు మరో మూడు నాలుగు చిత్రాలు సంక్రాంతి రేస్‌కు సిద్ధం కావడం విశేషం. నటుడు రిచర్డ్ రిషి కథానాయకుడిగా విజయ్.జీ దర్శకత్వంలో రూపొందిన ద్రౌపది –2, జీవా హీరోగా నటించిన తలైవర్ తంబి తలమైయిల్, నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అనివార్య కారణాల వల్ల చాలా కాలంగా విడుదలకు నోచుకోని సంతానం నటించిన సర్వర్ సుందరం చిత్రాలు ఈ నెల 15 న తెరపై రావడానికి సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన వా వాద్ధియార్ చిత్రం గత నెలలోనే విడుదల కావాల్సింది. ఆర్థిక సమస్యల కారణంగా ఈ చిత్రం కోర్టు గుమ్మం ఎక్కి విడుదల వాయిదా పడింది. కాగా తాజాగా ఈ చిత్రం కూడా సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ సంక్రాంతి మరింత కలర్ ఫుల్‌గా మారబోతోందనే చెప్పాలి.
వా వాద్దియార్
చిత్రంలో
కృతి శెట్టి, కార్తీ
తమిళసినిమా: కోలీవుడ్‌లో ఇతర నటులకు భిన్నంగా వ్యవహరించే నటుడు అజిత్ కుమార్. తనకు సంబంధించిన విషయాలు మినహా ఇతర విషయాల్లో జోక్యం చేసుకోని నటుడు ఈయన. ఇటీవల ఈయన కథానాయకుడు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ తోనే మరో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలుపడే అవకాశం ఉంది. కాగా అజిత్ నటనతో పాటూ కార్ రేస్ పోటీల్లోనూ ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈయన తన టీమ్ తో కలిసి అబదబి, పార్సిలోనా, మలేషియా వంటి దేశాల్లో జరిగిన అంతర్జాతీయ కార్ రేస్ పోటీల్లో పాల్గొని పథకాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 24 హెచ్ సిరీస్ కార్ రేస్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల ఆయన ఓ భేటీలో తన అభిమానుల శ్రేయస్సు గురించి ప్రస్తావించారు. తాను జీవితంలో గొప్పగా ఉండాలని తన అభిమానులు ఎలా కోరుకుంటున్నారో, అదేవిధంగా తాను వారు తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా అందరికీ గొప్ప అందమైన జీవితం అమరడానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు అజిత్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అభిమానులు జీవితంలో ఎదగాలి..!
అభిమానులు జీవితంలో ఎదగాలి..!


