విజయవంతంగా నాట్య ప్రదర్శనలు
కొరుక్కుపేట: శ్రీ భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తిరువన్నామలై ఆలయంలో నిర్వహించిన కూచిపూడి, భరతన్యాట ప్రదర్శనలు విజయవంతంగా ముగిశాయి. అకాడమీ గురువు, వ్యవస్థాపక డైరెక్టర్, కళాకారణి రోజా రాణి, డైరెక్టర్ దుర్గా నటరాజ్ నేతృత్వంలోఈ ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథులుగా తమిళనాడు ప్రభుత్వ ఆర్ట్ అండ్ కల్చర్ విభాగం మాజీ గౌరవ డైరెక్టర్ పూర్ణపుష్కల , కళాషోషకులు ప్రణతి పాల్గొని శ్రీ భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ సేవలను కొనియాడారు. కళాసింధూ స్కూల్ ఆఫ్ ఫర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు ఆచార్య సింధూ శ్యామ్, వారి శిష్యబృందం పాల్గొని నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ భారత్ కళా ఆర్ట్స్ అకాడెమీ గురువు, వ్యవస్థాపక డైరెక్టర్ రోజారాణిని ఘనంగా సత్కరించుకున్నారు.
రోజారాణికి ఘన సత్కారం


