ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
పళ్లిపట్టు: పళ్లిపట్టు యూనియన్‌లోని గొళ్లాలకుప్పం, పాండ్రవేడు, కేశవరాజుకుప్పం ప్రాంతాల్లో నివాశముంటున్న ఇరుళ కుటుంబాలకు వెంకటేశపురం ప్రాంతంలో వంద కుటుంబాలకు ఉచిత ఇంటి పట్టా లను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేశారు. ఈక్రమంలో తొలి విడతలో 35 కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మాణంకు సంబంధించి ఉత్తర్వులు పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని అర్హులైన 35 కుటుంబాలకు చెందిన ఇరుళలకు కేంద్ర ప్రభుత్వ ఇరుళ సంక్షేమ నిధులనుంచి రూ.5 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మాణంకు భూమిపూజ చేసి నిర్మాణపు పనులను ప్రారంభించారు. పళ్లిపట్టు నార్త్ మండల డీఎంకే కార్యదర్శి న్యాయవాది సీజే.శ్రీనివాసన్, పళ్లిపట్టు పట్టణ కార్యదర్శి సెందిల్‌కుమార్, డీఎంకే శ్రేణులు దండపాణి, ముత్తురెడ్డి, మీసై వెంకటేశన్ పాల్గొన్నారు.


