ఉరివేసుకుని పారిశ్రామికవేత్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరివేసుకుని పారిశ్రామికవేత్త ఆత్మహత్య

Jun 6 2023 9:24 AM | Updated on Jun 6 2023 9:35 AM

- - Sakshi

అన్నానగర్‌: కరుంగల్‌ సమీపంలో ఆదివారం రాత్రి ఓపారిశ్రామికవేత్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కరుంగల్‌ సమీపంలోని నెడియవిలకం ప్రాంతానికి చెందిన తంబిదురై సొంత ట్రక్కులతో వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి స్మైలీన్‌ ప్రభుదాస్‌ (32) అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి నడుపుతున్న ట్రక్కుతో వ్యాపారంలో బాధ్యతలు నిర్వర్తించేవాడు. అతను ఆల్డ్రిన్‌ ఎస్తేర్‌ బాయ్‌ (29)ని వివాహం చేసుకున్నాడు. ఇతనికి ఐదేళ్ల కుమారుడు, 6 నెలల కుమార్తె ఉన్నారు.

స్మైల్‌ ప్రభుదాస్‌ వ్యాపారంలో నష్టాలను చవిచూశారని, అప్పుల బాధలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా నిరుత్సాహంగా కనిపించారు. ఈ స్థితిలో ఆదివారం స్మైలీన్‌ ప్రభుదాస్‌ ఇంటిపై అంతస్తులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన అతని కుటుంబ సభ్యులు స్మైల్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని భార్య ఆల్డ్రిన్‌ ఎస్తేర్‌ భాయ్‌ కరుంగల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు స్మైల్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆచారిపాళ్యం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement