వివాహేతర సంబంధం: భార్యపై వేడి సాంబార్‌ పోసిన భర్త | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం: భార్యపై వేడి సాంబార్‌ పోసిన భర్త

May 28 2023 6:30 AM | Updated on May 28 2023 6:54 AM

- - Sakshi

తిరువొత్తియూరు: విల్లుపురం సమీపంలోని తిరువెన్నె నల్లూరులో వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భార్యపై భర్త వేడి సాంబార్‌ పోశాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. విల్లుపురం జిల్లా తిరువైన్నె నల్లూరు సమీపంలోని తడుతొట్ట కొండూరు గ్రామానికి చెందిన ఆరోగ్యస్వామి (40) ప్రొక్‌లైన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా డు. ఇతనికి కడలూరు జిల్లాకు చెందిన పెరియనాయకి(30)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

అతనికి ఆరోగ్యసామికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో శుక్రవారం వంట చేస్తున్నప్పుడు, భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆగ్రహించిన ఆరోగ్యసామి వేడి సాంబార్‌ను పెరియనాయకిపై పోశాడు. తీవ్రంగా గాయపడిన పెరియనాయకిని ఇరుగుపొరుగు వారు అంబులెన్స్‌లో ముండియంబాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తిరువెన్నెనల్లూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement