ఓట్లు తొలగించే పనిలో కాంగ్రెస్‌, బీజేపీ | - | Sakshi
Sakshi News home page

ఓట్లు తొలగించే పనిలో కాంగ్రెస్‌, బీజేపీ

Jun 18 2026 1:59 AM | Updated on Jun 18 2026 1:59 AM

హుజూర్‌నగర్‌ : కాంగ్రెస్‌, బీజేపీలు ఓట్లను తొలగించే పనిలో ఉన్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితేనే మనకు స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఆంధ్రా వాళ్లు రెండుసార్లు దొంగతనంగా నీళ్లు తీసుకుపోతుంటే చేతగాని స్థితిలో ఇక్కడి మంత్రులు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, నరేంద్రమోదీ కలయికతో వచ్చిన హైబ్రీడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా బీఎల్‌ఓలతో కలిసి మన ఓటర్లను కాపాడు కోవాలని, ప్రతి కార్యకర్త సమయానికి తగ్గట్టుగా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులను, వార్డు మెంబర్లను టార్గెట్‌ చేసి దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దానికి కార్యకర్తలు భయపడ వద్దని మీ అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యర్శి ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై పార్టీ కార్యకర్తలంతా ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, రేగట్టె మల్లిఖార్జునరెడ్డి, పిల్లుట్ల రఘు, కొప్పుల సైదిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, మారిపెద్ది శ్రీను, బెల్లంకొండ అమర్‌, నియోజకవర్గంలోని ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఫ కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి

అయితేనే మనకు స్వేచ్ఛ

ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement