గోదావరి నీటి విడుదల నిలిపివేత
అర్వపల్లి: రైతుల అభ్యర్థన మేరకు అదనంగా మూడు రోజులపాటు విడుదల చేసిన గోదావరి నీటిని గురువారం నిలిపివేశారు. వారబంధీ విధానంలో తిరిగి గోదావరి జలాలను ఈనెల 21న పునరుద్ధరించి 28వ తేదీ వరకు విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు.
రెడ్‌బుక్ డేను
జయప్రదం చేయాలి
సూర్యాపేట అర్బన్: సీపీఎం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న రెడ్ బుక్ డేను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కోరారు. గురువారం మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బరితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై అధ్యయనం చేసి రెడ్ బుక్ డే సందర్భంగా చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ హాజరవుతారని చెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు పాల్గొన్నారు.
మార్చి 26న బార్
అసోసియేషన్ ఎన్నికలు
చివ్వెంల(సూర్యాపేట) : బార్ అసోసియేషన్ ఎన్నికలు మార్చి 26న నిర్వహించనున్నట్లు తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల అయినట్లు పేర్కొన్నారు. మార్చి 9 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన, 16న ఉపసంహరణ, 27న ఎన్నికలు ఉంటాయని తెలిపారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం 30 శాతం మహిళా రిజర్వేషన్ ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
పీహెచ్‌సీల్లో
సకల వసతుల కల్పన
అర్వపల్లి : గర్భిణులకు సాధారణ ప్రసవాల కోసం పీహెచ్‌సీలలో అన్ని వసతులు కల్పించినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ గాజుల చంద్రశేఖర్ తెలిపారు. అర్వపల్లిలోని పీహెచ్‌సీలో గురువారం సామూహిక సీమంతం నిర్వహించారు. సహజ కాన్పుల వలన కలిగే ప్రయోజనాలను మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసిద్ధ, డాక్టర్ నజియ, మండల వైద్యాధికారి బి. నగేష్‌నాయక్, ప్రోగ్రాం అధికారి ఉమ, డెమో సంజీవరెడ్డి, సీహెచ్‌ఓ ఎం. బిచ్చునాయక్, మంగ, సర్పంచ్‌లు చిల్లంచర్ల విద్యాసాగర్, బింగి కృష్ణమూర్తి, ఎల్. కృష్ణానాయక్, సూపర్‌వైజర్ లలిత, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అనిత, నర్సింగ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి నీటి విడుదల నిలిపివేత


