మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత విజయం
భానుపురి (సూర్యాపేట) : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించిందని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉందని, అందుకే రాష్ట్రంలో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా దాదాపు 95కి పైగా మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్లు తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 31 వార్డుల్లో ఘనవిజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ రెబల్స్‌గా గెలిచిన నలుగురు స్వతంత్ర సభ్యులతో కలిపి దాదాపు 35 స్థానాల్లో కాంగ్రెస్ బలంగా నిలిచిందన్నారు. ఈ విజయానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీరా రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య సహా నాయకులందరూ ఐక్యంగా పనిచేయడమే కారణమన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, శ్రీనివాస్, భవాని పాల్గొన్నారు.
ఫ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్
కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి
ఆర్థికసాయం అందజేత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధరావత్ ధర్మా నాయక్ సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. వారి కుమార్తెల భవిష్యత్ విద్యా అవసరాల కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్‌లో ఎలాంటి అవసరం వచ్చినా సాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు.


