ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
నేరేడుచర్ల : పట్టా పాస్ పుస్తకాలు ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అప్పుడే ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్లలోని మన గ్రోమెర్ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఫార్మర్ రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్‌లో పాల్గొని మాట్లాడారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో పాటు భవిష్యత్‌లో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాల లబ్ధిపొందవచ్చన్నారు. ప్రతి రైతు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సూచనల మేరకు యూరియాను వినియోగించాలన్నారు. అధికంగా ఉపయోగిస్తే పంటలకు తెగులు, చీడ పురుగులు వచ్చే అవకాశం ఉందన్నారు. భూమిలో సముతుల్యత, భూసారం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. రైతులు అవసరం ఉన్నంత వరకు మాత్రమే యూరియా బుక్ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్స్ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు కల్టివేటర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్‌రెడ్డి, ఏఓ జావీద్, ఏఈఓ అవినాశ్ తదితరులున్నారు.
ఫ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి


